షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్ బాబు

0
60
mahesh babu at ad film shooting spot

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు షూటింగ్ కు వచ్చాడు. అయితే ఈ షూటింగ్ సినిమా షూటింగ్ కాదండోయ్ …….. యాడ్ ఫిలిం షూటింగ్ కోసం వచ్చాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ యాడ్ ఫిలిం షూటింగ్ జరుగుతోంది. ఈరోజు అలాగే రేపు కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ జరుగనుంది. ఇక ఈ రెండు రోజుల షూటింగ్ కోసం ఏకంగా 25 కోట్లు అందుకుంటున్నాడట. అంటే ఈ మొత్తం ఒక్కసారికే కాదు సుమా ! సదరు బ్రాండ్ కు అంబాసిడర్ కదా అందుకే ఈ భారీ మొత్తాన్ని అందుకుంటున్నాడట మహేష్ బాబు.

యాడ్ షూటింగ్ లో కోవిడ్ 19 నిబంధనలను అనుసరించి షూటింగ్ చేస్తున్నారు. మహేష్ బాబు దర్జాగా కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతున్న ఫోటోని సదరు పీఆర్ఓ మీడియాకు వదిలాడు …… ఇంకేముంది ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు యాడ్ ఫిలిం లలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు మహేష్ బాబు.

తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించనున్నాడు. ఎలాగూ యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్నాడు కాబట్టి వచ్చే నెల నుండి సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో పాల్గొనడం ఖాయం అనే అనుకోవాలి. పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్ గా అనన్య పాండే అని అనుకుంటున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి