ఉగాది రోజున తీపి కబురు చెప్పనున్న మహేష్ బాబు

0
25
mahesh babu new movie announcement on ugadi

సూపర్ స్టార్ మహేష్ బాబు ఉగాది రోజున తన అభిమానులకు తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు అంటూ దిగి సంచలన విజయాన్ని అందుకున్నాడు మహేష్. ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమా అనుకుంటే అది క్యాన్సిల్ అయ్యింది దాంతో ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. పరశురామ్ సినిమా లైన్ లోకి వచ్చినట్లు కథనాలు వినబడుతున్నాయి కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు దాంతో మరింత గందరగోళం మొదలయ్యింది అభిమానుల్లో.

ఆ గందరగోళాన్ని బద్దలు కొడుతూ కొత్త సినిమా ప్రకటన అధికారికంగా చేయనున్నారట మహేష్ బాబు దానికి ఉగాది సరైన వేదిక అని భావిస్తున్నాడట. తెలుగువారికి ఉగాది ప్రియమైన పండగ కావడంతో ఆ సందర్బంగా కొత్త సినిమా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పరశురామ్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ మహేష్ బాబు ని ఎలా హ్యాండిల్ చేస్తాడో తెరమీదే చూడాల్సి ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి