బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్న మహేష్ బాబు

0
95
rebel star

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వర్షం అనే బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్నాడు. వర్షం చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించాడు. 2004లో అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లతో పోటీ పడి మరీ వర్షం చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కు మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది వర్షం చిత్రం. వర్షం చిత్రానికి వసూళ్ల వర్షం కురిసింది. అయితే అంతటి బ్లాక్ బస్టర్ సినిమా మొదట మహేష్ బాబు దగ్గరకే వెళ్ళింది కానీ మహేష్ బాబు మాత్రం ఆ సినిమాని రిజెక్ట్ చేసాడు. వర్షం చిత్రాన్ని మహేష్ బాబు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా……..

దర్శకుడు శోభన్ కారకుడు. 2002 లో శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు  బాబీ అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అసలే వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న మహేష్ బాబుని బాబీ మరింతగా కృంగదీసింది. దాంతో అదే దర్శకుడు మళ్లీ వచ్చి వర్షం చిత్ర కథ చెప్పడంతో ఆ సినిమా చేయడానికి నిరాకరించాడు. మహేష్ బాబు నో చెప్పడంతో అదే కథని ప్రభాస్ తో చేసాడు శోభన్. కట్ చేస్తే వర్షం పెద్ద సంచలనం సృష్టించింది. 2004 లో విడుదలైన వర్షం బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా కంటే పెద్ద హిట్ అయ్యింది. అలా ఓ బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకున్నాడు మహేష్ బాబు. మహేష్ నో చెప్పడంతో ప్రభాస్ ఓ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆదన్న మాట అసలు సంగతి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి