ఎం ఎల్ సి గా పోటీ చేయనున్న కోదండరాం

0
65

ఖమ్మం , నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ వర్గం నుండి ప్రొఫెసర్  కోదండరాం పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ పట్టభద్రుల ఎం ఎల్ సి స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి దాంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడట కోదండరాం. పట్టభద్రుల స్థానానికి ఓటు వేసే వాళ్లంతా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కాబట్టి వాళ్లలో ఎక్కువమంది కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి తనకు తప్పకుండా విజయం లభిస్తుందని ధీమాగా ఉన్నాడట కోదండరాం.

ఖమ్మం – నల్గొండ లలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువే ఉంది. అలాగే ఖమ్మం , నల్గొండ, వరంగల్ లలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు కూడా బలం ఉంది దాంతో ప్రతిపక్షాల అండతో అలాగే ప్రభుత్వం పై అసంతృప్తి తో ఉన్నవాళ్ల అండతో విజయం సాధించడం ఖాయమని నమ్ముతున్నాడట కోదండరాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జే ఏ సి కన్వీనర్ గా కోదండరాం కృషి ఎనలేనిది అనే చెప్పాలి. ఉద్యమ నాయకుడిగా ఉన్న కోదండరాం అంటే అన్ని పార్టీలతో గౌరవ భావం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుండి కేసీఆర్ తో కోదండరాం కు పొసగలేదు దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దాని వల్ల కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటికీ కోదండరాం కు ప్రాధాన్యత లేకుండా పోయింది. దాంతో గత ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టాడు కానీ జనాలు ఆదరించలేదు. అలాగే జనగామ నుండి పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు. మరి ఈ పట్టభద్రుల స్థానం నుండి పోటీ చేసి గెలిచి శాసనమండలిలో అడుగు పెడతాడా ? అన్నది వేచి చూడాల్సిందే.  

మునుపటి వ్యాసంఆ రీమేక్ కు డైలాగ్స్ అందిస్తున్న తరుణ్ భాస్కర్
తదుపరి ఆర్టికల్కరోనాతో సహజీవనం తప్పదంటున్న కేసీఆర్ : 2200 కరోనా రోగులు ఎక్కడ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి