నాని వి కోసం ఆ డేట్ ని ఎందుకు లాక్ చేసారో తెలుసా

0
60
v movie nani

నాని , సుధీర్ బాబు , నివేదా థామస్ , అదితి రావు హైదరీ తదితరులు నటించిన ” వి ” చిత్రం ఎట్టకేలకు అమెజాన్ లో సెప్టెంబర్ 5 న స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇన్ని రోజుల తర్జన భర్జన అనంతరం నిర్మాత దిల్ రాజు ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం భారీ ఆఫర్ దక్కడమే. 35 కోట్ల భారీ డీల్ వి సినిమాకు దక్కిందట దాంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా వల్ల లాక్ డౌన్ విధించడం థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

వచ్చే నెలలో థియేటర్లకు అనుమతి లభించనున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు ఇలాంటి సమయంలో థియేటర్ లలో సినిమా విడుదల చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు……. ప్రేక్షకులు ఇంతముముందు లాగా థియేటర్ లకు వచ్చే పరిస్థితి లేనందున అన్నీ ఆలోచించిన తర్వాతే దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడట. కాస్త ఆలస్యమైనా సెప్టెంబర్ 5 నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది క్రైమ్ థ్రిల్లర్ వి.

నాని నెగెటివ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇక నివేదా థామస్ తో పాటుగా అదితి రావు హైదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 5 న వి సినిమాని ఎందుకు స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తున్నారో తెలుసా ……. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం నాని హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం అష్టా చమ్మా విడుదలైన రోజు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం నాని హీరోగా పరిచయం అయ్యాడు మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా వి సినిమా స్ట్రీమింగ్ కి అంగీకరించారట. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి