యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం లెజెండరీ డైరెక్టర్

0
36
prabhas movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం లెజెండరీ డైరెక్టర్ ని తీసుకొస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేతలు. ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో అంటే దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అగ్ర నిర్మాత అశ్వనీదత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునే ని ఎంపిక చేసారు. మహానటి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు కానీ ఎక్కడో కొద్దిగా అనుమనం.

ఎందుకంటే భారీ సినిమా అందునా సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి దీన్ని నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేయగలడా ? అన్న అనుమానం ప్రభాస్ లో నెలకొంది అందుకే ఆ అనుమానాన్ని ప్రభాస్ వ్యక్తం చేయడంతో సీనియర్ దర్శకులు అయిన సింగీతం శ్రీనివాసరావు ని ఈ సినిమాకోసం క్రియేటివ్ హెడ్ గా తీసుకున్నారు. ఈ భారీ సినిమాకు మీ సహాయ సహకారాలు కావాలి అని అశ్వనీదత్ తో పాటుగా దర్శకుడు నాగ్ అశ్విన్ కోరడంతో సింగీతం శ్రీనివాసరావు కాదనలేకపోయాడు.

అపూర్వ సహోదరులు , ఆదిత్య 369 , పుష్పక విమానం లాంటి చిత్రాలతో ప్రభంజనం సృష్టించాడు సింగీతం శ్రీనివాసరావు. తెలుగునాట కమర్షియల్ చిత్రాలు మాత్రమే వస్తున్నప్పటికీ సింగీతం మాత్రం ప్రయోగాలకు పెద్ద పీట వేసాడు అలాగే ఆ ప్రయోగాలతో భారీ విజయాలను కూడా అందుకున్నాడు అందుకే ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా పనిచేయనున్నారు. మొత్తానికి ప్రభాస్ కున్న అనుమానాన్ని సింగీతంతో భర్తీ చేసారు. 

మునుపటి వ్యాసంఆర్ ఆర్ ఆర్ వర్క్ రెడీ అంటున్న కీరవాణి
తదుపరి ఆర్టికల్తమన్నా డిమాండ్ కు తలొగ్గిన నితిన్  
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి