ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ తనయుడు మృతి

0
32
anuradha paudwal son dies

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబయి- ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనురాధా పౌడ్వాల్ తనయుడు ఆదిత్య పౌడ్వాల్ మరణించడంతో అనురాధా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ గాయనిగా అనురాధా పౌడ్వాల్ దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. అనురాధా పౌడ్వాల్ తనయుడు అయిన ఆదిత్య పౌడ్వాల్ వయసు 35 సంవత్సరాలు. సంగీత దర్శకుడిగా బాలీవుడ్ లో రాణిస్తున్న ఆదిత్య గతకొంత కాలంగా కిడ్నీ , ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు.

అయితే చికిత్స పొందుతున్నప్పటికీ ఆదిత్య ఆరోగ్యం విషమిస్తూ ఉండటంతో నాలుగు రోజుల క్రితం ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు ఆదిత్య ఆరోగ్యం మరింతగా విషమించడంతో కన్నుమూశాడు. తనయుడు మృతితో అనురాధా పౌడ్వాల్ కుటుంబం కన్నీళ్ల పర్యంతం అయ్యింది. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అతడ్ని తలుచుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు.

ఇక ఆదిత్య చనిపోయిన విషయాన్ని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ వెల్లడించాడు. తనకు ఆదిత్యకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఉద్విగ్నతకు లోనయ్యాడు శంకర్ మహదేవన్. మేమిద్దరం కలిసి ఎన్నో ఆల్బమ్ లను రూపొందించాం , అయితే ఇంత చిన్న వయసులోనే మమ్మల్ని విడిచి వెళతాడని అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు శంకర్ మహదేవన్. అనురాధా పౌడ్వాల్ – అరుణ్ పౌడ్వాల్ ల వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఆదిత్య తీవ్ర అనారోగ్యంతో తనువు చాలించాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి