లారెన్స్ సంచలన ప్రకటన

0
36
raghava supporting rajini sir

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నై-  నటుడు , దర్శకుడు రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేసాడు దాంతో తమిళ నాట మరోసారి రాజకీయ కలకలం మొదలైంది. వచ్చే ఏడాది ఆఖరున తమిళనాడులో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో తన అభిమాన హీరో అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టె పార్టీలో చేరి ప్రజాసేవ మరింతగా చేస్తానని బాంబ్ పేల్చాడు రాఘవ లారెన్స్. గతకొంత కాలంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడు అని వినడమే తప్ప రాజకీయ పార్టీ ఇంతవరకు పెట్టలేదు. ఇక ఇప్పుడేమో తమిళనాట ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం పైగా ఉంది దాంతో తమిళనాట రాజకీయ వేడి మొదలైంది.

నేను నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో పలువురు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రజా సేవ చేయాలనీ ఒత్తిడి చేస్తున్నారని , అయితే నేను రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులను విమర్శించను ఎందుకంటే నా గురువు రజనీకాంత్ ప్రత్యర్థులను ఎప్పుడూ విమర్శించలేదు , ఇప్పుడు కూడా విమర్శించి పబ్బం గడుపుకోవాలని అనుకోవడం లేదు కాబట్టి నాదారి కూడా అదే అని అంటున్నాడు లారెన్స్. నా చారిటబుల్ ట్రస్ట్ కు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత , కరుణానిధి ఎంతగానో తోడ్పడ్డారు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి , స్టాలిన్ లు కూడా నాకు సహాయ సహకారాలు అందించారు అందుకే నేను ప్రత్యర్థులను విమర్శించకుండా రాజకీయాలు చేయాలనీ నిర్ణయించుకున్నాను……. రజనీకాంత్ పెట్టే పార్టీలో చేరతాను అంటూ కుండబద్దలు కొట్టాడు లారెన్స్.

అయితే రజనీకాంత్ ఇదిగో వస్తున్నాను , అదిగో వస్తున్నాను అని అంటున్నాడు కానీ ఇంతవరకు రాజకీయ పార్టీ అయితే పెట్టలేదు. ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది కాబట్టి వచ్చే ఏడాది పార్టీ ప్రారంభిస్తాడో ఏమో చూడాలి. మొత్తానికి తమిళనాట వచ్చే ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయని మాత్రం అర్ధం అవుతోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి