అల్లు అర్జున్ పర్యనటపై పెద్ద ఎత్తున విమర్శలు

0
46
alluarjuntour in adhilabadh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ జిల్లా లోని కుంటాల జలపాతంని సందర్శించాడు. ఇక అటవీ శాఖాధికారులు దగ్గరుండి మరీ కుంటాల జలపాతం విశేషాలను వెల్లడించారు. దాంతో ఆదిలాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అలాగే కుంటాల జలపాతాన్ని చూడటానికి వచ్చే వీక్షకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. సెలబ్రిటీలు వస్తే అటవీ శాఖాధికారులు దగ్గరుండి మరీ చూపిస్తున్నారు వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు అదే మమ్మల్ని మాత్రం చూడనివ్వడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు.


ఈరోజు అల్లు అర్జున్ తన భార్యాపిల్లలతో కలిసి కుంటాల జలపాతంని దర్శించాడు. అల్లు అర్జున్ తో పాటుగా పుష్ప చిత్ర యూనిట్ లో కొంతమంది కూడా ఉన్నారు. అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఆదిలాబాద్ అంటే దట్టమైన అటవీ ప్రాంతానికి ప్రసిద్ధి అందుకే పుష్ప షూటింగ్ కు ఎలా ఉపయోగపడనుందో చూడటానికి చిత్ర యూనిట్ ని కూడా తీసుకొచ్చాడు అల్లు అర్జున్.

ఆదిలాబాద్ లోని హరితవనంలో తన పిలల్లతో కలిసి విడిది చేసాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ వచ్చాడన్న విషయం క్షణాల్లో పాకడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు యువతీయువకులు. దాంతో వాళ్ళని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. హరితవనంలో ఎర్రచందనం మొక్కలు నాటాడు అల్లు అర్జున్. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో వాళ్ళని పలకరిస్తూ ఉత్సాహపరిచాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి