మూడో పెళ్లిపై లక్ష్మీ రామకృష్ణన్ వనిత ల గొడవ

0
14

పీటర్ పాల్ ని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది వనిత విజయ్ కుమార్. నటుడు విజయ్ కుమార్ మంజుల ల కూతురు అయిన వనిత ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇటీవలే మూడో పెళ్లి చేసుకుంది పీటర్ పాల్ ని. అయితే పీటర్ పాల్ మొదటి భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడని పోలీసులను ఆశ్రయించింది. దాంతో పెద్ద గొడవ జరుగుతోంది ఈ విషయంపై. సరిగ్గా ఇదే సమయంలో నటి , దర్శకురాలు అయిన లక్ష్మీ రామకృష్ణన్ వనిత మూడో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసి. ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఈ మూడో పెళ్లి తోనైనా వనిత సంతోషంగా ఉండాలి…… ఇంతకుముందు రెండు పెళ్లిళ్ల సంగతి పక్కన పెడదాం అని వ్యాఖ్యానించింది. దాంతో పెద్ద దుమారమే చెలరేగింది లక్ష్మీ రామకృష్ణన్ వ్యాఖ్యలతో.

నేను ఎలాంటి పరిస్థితుల్లో విడిపోయానో అది నాకు మాత్రమే తెలుసు . అది బయటి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అలాగే నా వ్యక్తిగత జీవితంలోకి బయటివాళ్ళు తొంగిచూడాల్సిన అవసరం లేదు అని ఖరాఖండిగా చెప్పింది వనిత. నాకు ఎవరు కూడా ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని , నా జీవితం నా ఇష్టం అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది వనిత. హీరోయిన్ గా నటించిన వనిత ఇంతకుముందు రెండు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు పిల్లలను కన్నది. ఇద్దరు కూతుర్లు కాగా ఒక అబ్బాయి. ఇక ఇప్పుడేమో ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది వనిత విజయ్ కుమార్.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి