పవన్ కల్యాణ్ క్రిష్ లుక్ కూడా వచ్చేసింది

0
146
awan kalayan krish movie prelook

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్ 27 వ చిత్రం ప్రీ లుక్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ స్పష్టంగా కనిపించడం లేదు కానీ మొఘలుల సామ్రాజ్యంలో బందిపోటు దొంగ గా పవన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. పౌరుషానికి మారుపేరుగా ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ పవన్ తన నడుముపై చేయి వేసి నిలుచున్న తీరుకి ఫిదా అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఖుషీ చిత్రాన్ని నిర్మించింది ఎవరో కాదు ఈ ఏ ఎం రత్నమే. ఆ తర్వాత బంగారం అనే సినిమా తీసినప్పటికి అది పెద్దగా ఆడలేదు. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్లీ పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నాడు ఏ ఎం రత్నం. ఇక ఈ సినిమా 15 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. పవన్ కల్యాణ్ పై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు క్రిష్.

15 రోజుల పాటు మీపై తీసిన సన్నివేశాలు మాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయని పవన్ వ్యక్తిత్వం గురించి పేర్కొంటూ ట్వీట్ చేసాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ పవన్ – క్రిష్ ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ రాబిన్ హుడ్ తరాహ పాత్రలో బందిపోటు గా నటించనున్నాడు. మొత్తానికి పవన్ కల్యాణ్ ప్రీ లుక్ తో ఈరోజంతా ఫ్యాన్స్ కు పండగే పండగ.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి