కొరటాల శివకు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ !

0
24
koratala shiva next movie with jr ntr

మిర్చి చిత్రంతో సంచలనం సృష్టించిన కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు గాను కొరటాల శివ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …… 25 కోట్ల రెమ్యునరేషన్ అంట! వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజమేనట ! కొరటాల శివ కు ఆచార్య కేవలం 5 సినిమా మాత్రమే ! అయినప్పటికీ డిమాండ్ ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన కొరటాల సినిమాకు 25 కోట్లు డిమాండ్ చేసాడట.

కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన నాలుగు చిత్రాలు మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి దాంతో అతడితో బేరం ఆడకుండా సక్సెస్ రేటు నూటికి నూరు శాతం ఉంది కనుక మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారట. కొరటాల శివ ఇంతవరకు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు కూడా సందేశాత్మకమైనవి అన్న సంగతి తెలిసిందే. ఇక ఆచార్య కూడా అదే కోవలో ఉండనుందట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి