డైరెక్టర్ గా మారుతున్న కోన నీరజ

0
62
neeraja kona

రైటర్ కోన వెంకట్ సోదరి కోన నీరజ డైరెక్టర్ గా మారబోతోంది. స్టైలిస్ట్ గా టాలీవుడ్ లో రాణిస్తున్న కోన నీరజ మెగా ఫోన్ పట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. 2013 నుండి స్టైలిస్ట్ గా రాణిస్తున్న కోన నీరజ ప్రస్తుతం 5 బౌండెడ్ స్క్రిప్ట్ లను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం హీరోలకు కథ చెప్పే పనిలో పడింది కోన నీరజ. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మెగా ఫోన్ పట్టాలని నిర్ణయించుకుందట.

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా విజయ్ , సూర్య , కార్తీ చిత్రాలకు స్టైలిస్ట్ గా పనిచేసింది కోన నీరజ. పలువురు హీరోలు కోన నీరజకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళతో సినిమాలు చేయాలని 5 రకాల స్క్రిప్ట్ లను రాసుకుందట. ముందుగా ఏ హీరో ఛాన్స్ ఇస్తే వాళ్ళతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కోన వెంకట్ రచయితగా సంచలన విజయాలు అందుకున్నాడు. దాంతో కోన నీరజ కూడా విజయం సాధిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్ లు తక్కువే. కానీ ఇటీవల కాలంలో లేడీ డైరెక్టర్ లు ఎక్కువ అవుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి