కొడుకు కోసం విలన్ గా మారుతున్న స్టార్ హీరో

0
34

కొడుకుని హీరోగా నిలబెట్టడానికి విలన్ గా మారుతున్నాడు స్టార్ హీరో విక్రమ్. తమిళనాట స్టార్ హీరో అయిన విక్రమ్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఇటీవల కాలంలో విక్రమ్ నటించిన చిత్రాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో హీరోగా తన కొడుకు ధృవ్ ని హీరోగా పరిచయం చేసాడు. తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో ఆదిత్య వర్మగా రీమేక్ చేసాడు. ఆదిత్య వర్మ చిత్రంతో ధృవ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ అనుకున్న స్థాయిలో సినిమా విజయం సాధించలేకపోయింది. దాంతో ఇప్పుడు మరో కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్.

ఇక ఈ సినిమాలో విక్రమ్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. కొడుకు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కొడుకు పాలిట విలన్ గా మారుతున్నాడట. దాంతో ఈ వార్త తమిళనాట హల్చల్ చేస్తోంది. కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం విక్రమ్ పెద్ద సాహసమే చేస్తున్నాడు అని చెప్పక తప్పదు. వారసుడిని హీరోగా నిలబెట్టడం కోసం విక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు విజయవంతం అయితే విక్రమ్ కు కాస్త ఊరట లభిస్తుంది. వారసులను పరిచయం చేయడమే కాదు వాళ్ళని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టేంత వరకు పాపం కష్టాలు తప్పవు.

మునుపటి వ్యాసంకరోనా తగ్గేవరకు షూటింగ్ లు వద్దంటున్న భామ
తదుపరి ఆర్టికల్మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టిన వర్మ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి