నిజాలు తెలుసుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ : సంచయిత

0
31
sanchaitha

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్– పవన్ కళ్యాణ్ గారు మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ హితువు పలుకుతోంది మాన్సాస్ ట్రస్ట్ , సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచయిత. మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి చేతిలో ఉందని మీరు వ్యాఖ్యానించారు. అందుకే కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను . మా నాన్న ఆనంద్ గజపతి రాజు మా అమ్మ ఉమా గజపతి రాజు ల పెద్ద కుమార్తెను నేను. మా అమ్మ మళ్ళీ రెండో వివాహం చేసుకుంది. ఆయన కూడా హిందువే ! రమేష్ శర్మ గారిని మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది అయన హిందూ పురోహిత కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. నేను వాళ్ళ వారసురాలిగా హిందూ ధర్మాన్నే ఆచరిస్తున్నాను అలాగే ఇతర మతాలను కూడా గౌరవిస్తాను అంచేత నన్ను హిందూ యేతర వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు.

తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మకండి , వాస్తవాలను తెలుసుకోండి అలాగే మీ వ్యాఖ్యలను సరిదిద్దుకోండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది సంచయిత. తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట పడాలంటే మీరు మళ్ళీ ఈ విషయంపై ట్వీట్ చేస్తే బాగుంటుందని అప్పుడే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్వీట్ చేసింది సంచయిత.

మాన్సాస్ ట్రస్ట్ , సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా సంచయితని జగన్ ప్రభుత్వం తెచ్చిపెట్టింది. దాంతో అప్పటి నుండి ఈ రగడ జరుగుతూనే ఉంది. సంచయిత అన్య మతాన్ని స్వీకరించిందని టీడీపీ ఆరోపిస్తోంది. కావాలనే అశోక్ గజపతి రాజుని తప్పించి చైర్మన్ గా సంచయితని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇందుకు పెద్ద ఎత్తున కుట్ర కోణం ఉందని టీడీపీ ఆరోపిస్తుండగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే నిజమని వ్యాఖ్యానించాడు దాంతో నేను హిందువునేనని అంటోంది సంచయిత.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి