కిక్ శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు

0
61

నటుడు కిక్ శ్యామ్ ని అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. చెన్నై లోని కోడంబాక్కం లో అనుమతి లేకుండా పోకర్ క్లబ్ నడుపుతున్నాడు కిక్ శ్యామ్. అనుమతి లేకపోయినప్పటికీ , కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా పేకాట ఆడిస్తుండటంతో పాటుగా బెట్టింగ్ లను కూడా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తమిళనాడు పోలీసులకు తెలియడంతో కిక్ శ్యామ్ ని అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్న కిక్ శ్యామ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తమిళ నటుడైన కిక్ శ్యామ్ రవితేజ హీరోగా నటించిన కిక్ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు. కిక్ 2 , రేసుగుర్రం , ఊసరవెల్లి చిత్రాలతో పాటుగా తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటించాడు కిక్ శ్యామ్. తమిళ , తెలుగు చిత్రాలలో నటిస్తున్న కిక్ శ్యామ్ ఈజీ మని కోసం ఇలా అడ్డదారులు తొక్కడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిక్ శ్యామ్ అరెస్ట్ వార్త క్షణాలలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పాకిపోయింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి