సినిమా ప్రకటించిన ఖైదీ దర్శకుడు

0
28
khaidi movie directore new movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్లోకనాయకుడు కమల్ హాసన్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్. కార్తీ నటించిన ఖైదీ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ తాజాగా ఇళయ దళపతి విజయ్ తో మాస్టర్ అనే సినిమాని రూపొందించాడు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక ఈలోపు కమల్ హాసన్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. అలాగే ఈ సినిమాని అధికారికంగా నిన్న సాయంత్రం ప్రకటించారు కూడా. ఇక దీనికి అప్పట్లో ఓ దెయ్యం ఉండేది అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు లోకేష్ కనగరాజ్.

ఇక ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ఐన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయాలనే సంకల్పానికి కూడా వచ్చారు . అంటే కాస్త కరోనా తగ్గుముఖం పడితే వెంటనే షూటింగ్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా కమల్ హాసన్ భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కంప్లీట్ కాకముందే సొంత సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు పోటీ పడుతున్నారు. ఇక ఖైదీ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న కార్తీకి ఖైదీ మంచి విజయాన్ని అందించడమే కాకుండా నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. కమల్ హాసన్ విషయానికి వస్తే త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి తమిళనాట ఎన్నికలకు సిద్ధం కావాలని చూస్తున్నాడు. 

మునుపటి వ్యాసంఈనెల 30 న కోర్టుకు హాజరుకానున్న అద్వానీ
తదుపరి ఆర్టికల్ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి