ఖైదీ సీక్వెల్ వేగవంతం

0
50
karthi hero

ఖైదీ సీక్వెల్ అనగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ సినిమా సీక్వెల్ అనుకోవద్దు సుమా…… తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా సీక్వెల్ గురూ. కార్తీ హీరోగా నటించిన ఖైదీ చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో కార్తీ మళ్లీ విజయాల బాట పట్టాడు. గత కొంత కాలంగా కార్తీ వరుస పరాజయలతో సతమతం అవుతున్న సమయంలో ఖైదీ రూపంలో సాలిడ్ హిట్ కొట్టాడు. జైలు నుండి విడుదలైన ఓ ఖైదీ ఓ రాత్రి పూట ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? రక్షణ కల్పించాల్సిన పోలీసులకు ఈ ఖైదీ ఎలా రక్షణ గా నిలబడ్డాడు అన్న కథాంశంతో తెరకెక్కింది ఖైదీ.

ఈ తమిళ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో ఖైదీ  సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు లోకేష్ కనగరాజ్. అందుకోసం టాలీవుడ్ హీరోని కూడా మరో కీలక పాత్ర కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. అలాగే మొదటి భాగంలో హీరోయిన్ లేదు కానీ రెండో భాగంలో మాత్రం హీరోయిన్ ని పెట్టనున్నారట. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో స్పష్టం చేయనున్నారు.

మునుపటి వ్యాసంకరోనాతోమరణించిన మాజీ ఎం ఎల్ ఏ
తదుపరి ఆర్టికల్విలన్ పాత్రలో హీరో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి