కేజిఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ ?

0
19
neel kgf directore

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ చిత్రంతో కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజిఎఫ్ తో కన్నడ హీరో యష్ ని ఒక్కసారిగా స్టార్ హీరోని చేసాడు ప్రశాంత్ నీల్. సాధారణమైన కథే అయినప్పటికీ చిత్రీకరణలో , స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేసాడు ప్రశాంత్ నీల్. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పిచ్చెక్కించాడు మాస్ ప్రేక్షకులను. ఓ సాధారణ హీరోని హై రేంజ్ లో చూపిస్తే ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో ఊహించతరమా !

నిజంగా ప్రభాస్ ఇమేజ్ కు అలాగే అతడికి ఉన్న స్టార్ డంకు ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ సెట్ అయితే ఆ సినిమా రేంజ్ చెప్పనలవి కాదు. అంత అద్భుతంగా రావడం ఖాయం. ఇప్పటికైతే ఇంకా మొత్తం సెట్ కాలేదు కానీ కేజిఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా ఉండనుంది. ప్రభాస్ రేంజ్ కు తగ్గట్లుగా హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా రూపొందించనున్నాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉండనుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. అంటే 2022 తర్వాత అన్నమాట.

మునుపటి వ్యాసంఅర్ధరాత్రి కత్రినా కైఫ్ ఇంటికి వచ్చిన యంగ్ హీరో
తదుపరి ఆర్టికల్ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి