ఆర్ ఆర్ ఆర్ వర్క్ రెడీ అంటున్న కీరవాణి

0
41
rrr shoot will start soon

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని ఎన్టీఆర్ అభిమానులకు తీపి కబురు అందించాడు ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కీరవాణి ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త అందించాడు. ప్రస్తతం నేను క్రిష్ సినిమాతో పాటుగా కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్న సినిమాకోసం పనిచేస్తున్నానని , ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయని అందుకు రంగం సిద్ధం అవుతోందని ట్వీట్ చేసాడు. కీరవాణి ట్వీట్ చేయడం అంటే రాజమౌళి అన్నయ్య కాబట్టి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మీద ఎన్టీఆర్ అభిమానులకు కాన్ఫిడెంట్ ఉన్నట్లే.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలను చేపట్టి షూటింగ్ చేయనున్నారట. అయితే ముందుగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనేది ఎవరో తెలుసా ……. ఎన్టీఆర్ . అవును ఎన్టీఆర్ మీద పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఎన్టీఆర్ మీదే ఎందుకు షూటింగ్ చేయనున్నారో తెలుసా ……. చరణ్ కు సంబందించిన వీడియో విడుదల చేసాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. కానీ ఎన్టీఆర్ వీడియో మాత్రం ఇంకా విడుదల చేయలేకపోయాడు అందుకు కారణం ఏంటంటే టీజర్ కు కావాల్సిన సన్నివేశాలు ఎన్టీఆర్ మీద చిత్రీకరించకపోవడమే.

అందుకే ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి ఓ వీడియో విడుదల చేయాలనీ చూస్తున్నాడు జక్కన్న. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తోంది జక్కన్న మీద. చరణ్ వీడియో వచ్చింది మా ఎన్టీఆర్ వీడియో ఎపుడు ? అంటూ ప్రశ్నిస్తున్నారు అందుకే ఇలా ప్లాన్ చేసాడట జక్కన్న. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ – ఒలీవియా మోరిస్ లపై కూడా పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట జక్కన్న. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. 

మునుపటి వ్యాసంనిశ్శబ్దం ట్రైలర్ వచ్చేసింది
తదుపరి ఆర్టికల్యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం లెజెండరీ డైరెక్టర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి