నన్ను కేసీఆర్ ట్రాప్ చేసాడు : డి. శ్రీనివాస్

0
42
d srinivas trs leader

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-నన్ను కేసీఆర్ ట్రాప్ చేసాడు దాంతో కాంగ్రెస్ పార్టీ ని వీడాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి , రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన డి. శ్రీనివాస్ రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసాడు అలాగే మంత్రి పదవి కూడా చేపట్టాడు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో ఆ పార్టీని పలువురు నాయకులు వీడారు అందులో ధర్మపురి శ్రీనివాస్ ఒకరు. ఎవరు వెళ్లినా వెల్లకున్నా డి. శ్రీనివాస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వీడడు అని అనుకున్నారు అంతా …… అయితే అందరికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు.

మొదట్లో డి. శ్రీనివాస్ కు మంచి మర్యాద లభించింది టీఆర్ఎస్ పార్టీలో అయితే ఆ తర్వాత మాత్రం డి. శ్రీనివాస్ ని దూరం పెట్టారు అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని అతడిమీద చర్యలు తీసుకోవాలని ఏకంగా కేసీఆర్ కూతురు కవిత ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఇక అప్పటి నుండి డి. శ్రీనివాస్ ని మరింత దూరం పెట్టారు. అయితే పార్టీ నుండి మాత్రం సస్పెండ్ చేయలేదు. దాంతో సాంకేతికంగా టీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నాడు డి. శ్రీనివాస్.

తాజాగా డి. శ్రీనివాస్ 73 వ పుట్టినరోజు సందర్బంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ నన్ను ట్రాప్ చేసాడని , స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించడంతో పెద్ద పొరపాటు చేసానని , కాంగ్రెస్ పార్టీని వీడటం నేను చేసిన పెద్ద తప్పు అని తేల్చాడు. టీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం కుటుంబ పార్టీ అని అక్కడ ఎవరికీ గౌరవం లేదని కుండబద్దలు కొట్టాడు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానని స్పష్టం చేసాడు డి. శ్రీనివాస్.

మునుపటి వ్యాసంరకుల్ ఫోన్ ని సీజ్ చేసిన ఎన్సీబీ
తదుపరి ఆర్టికల్కరోనాతో ఆసుపత్రిలో చేరిన హీరో విజయ్ కాంత్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి