కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం: కరోనా టెస్ట్ ఫ్రీ

0
82

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రయివేటు ఆసుపత్రుల్లో సైతం కరోనా టెస్ట్ ఫ్రీగా నిర్వహించాలనే ప్రజలు హర్షించే నిర్ణయాన్ని తీసుకుంది కేసీఆర్ సర్కారు. కరోనా చికిత్స విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటోంది తెలంగాణ ప్రభుత్వం. దాంతో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కరోనా చికిత్స విషయంలో ప్రజలకు విశ్వాసం కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తూ పలు సూచనలు చేసింది. దానికి తోడు కరోనా విషయంలో పక్క రాష్ట్రమైన ఏపీ ముందంజలో ఉంది పలు విషయాల్లో.

తెలంగాణ లో పలు ప్రయివేటు ఆసుపత్రులలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తుండగా ఏపీలో మాత్రం ఉచితంగా చికిత్స అందిస్తున్నాడు జగన్. అలాగే కరోనా తో మరణించిన వ్యక్తి కుటుంబానికి 15 వేలు కర్మకాండల కోసం ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు జగన్. అలాగే ఏపీలో పెద్ద ఎత్తున కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లో ఇబ్బందులు రావడంతో కేసీఆర్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్ట్ లను నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా టెస్ట్ లను పెద్ద ఎత్తున నిర్వహించాలని టెస్ట్ లకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కరోనా టెస్ట్   ఫ్రీ అనే నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే హోం ఐసోలేషన్ ఉంటున్న వాళ్లకు కిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే.

మునుపటి వ్యాసంరెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న విజయ్ ఎన్నికల కోసమేనా
తదుపరి ఆర్టికల్26 జిల్లాలుగా మారుతున్న ఆంధ్రప్రదేశ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి