కేసీఆర్ సర్కారు పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి

0
79

నిజాం నిధులు దోచుకోవడానికే సెక్రటేరియట్ కూల్చారని సంచలన వ్యాఖ్యలు చేసాడు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ నిజాం నవాబు కట్టిందని, దాంట్లో పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయని అందుకే ఆ నిధులను దోచుకోవడానికే కేసీఆర్ సర్కారు ఇంత హడావుడిగా సెక్రటేరియట్ ని కూల్చుతోందని అంటున్నాడు. పెద్ద ఎత్తున పోలీసులను ఎందుకు అక్కడ పెట్టారు. మీడియా కు కానీ ఇతరులను కానీ అక్కడికి ఎందుకు రానీయడం లేదు. లేదంటే సీక్రెట్ గా ఈ తతంతమంతా ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రేవంత్ రెడ్డి.

ఒకవైపు జ్యోతిష్యం పిచ్చి మరోవైపు కొడుకుని ముఖ్యమంత్రి ని చేయడానికి ఇదంతా చేస్తున్నాడని , అలాగే సెక్రటేరియట్ అంతర్భాగంలో నిజాం నిధులు ఉన్నాయనే సమాచారం ఉందని అందుకే సెక్రటేరియట్ ని కూలుస్తున్నారని ఆరోపించాడు రేవంత్ రెడ్డి. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నాడని , ప్రజలు ఇప్పటికైనా ఎదురుతిరగాలని కోరుతున్నాడు రేవంత్ రెడ్డి.

మునుపటి వ్యాసంయాత్ర డైరెక్టర్ తో అల్లు అర్జున్ పొలిటికల్ మూవీ
తదుపరి ఆర్టికల్వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్రెండీ లుక్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి