సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

0
32
kcr sensational decision

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో వ్యవస్థని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు అలాగే రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగవు. ఆమేరకు సబ్ రిజిస్టార్ లకు ఆదేశాలు జారీ చేసారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో ల దగ్గర ఉన్న భూముల రికార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.

ఈ నిర్ణయాలతో ఒక్కసారిగా రాజకీయ కలకలం మొదలైంది. ఇక వీఆర్వో లు తీవ్రంగా మండిపడుతున్నారు కేసీఆర్ నిర్ణయం పట్ల. రెవిన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని , అందుకు వీఆర్వో , తహసీల్దారులు అని అందుకే తహసీల్దార్ ల అధికారానికి కత్తెర వేయడానికి ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడట కేసీఆర్. గత అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ ఈ విషయం పై ప్రకటన చేసాడు. ఇక కొద్దిసేపట్లోనే జరుగబోయే కేబినెట్ సమావేశంలో ఓ చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఈ చట్టంతో వీఆర్వో వ్యవస్థ మొత్తం రద్దు కానుంది అయితే వీఆర్వోలుగా పనిచేసే వాళ్ళని ఉద్యోగాల్లోంచి తొలగించకుండా వాళ్ళని మరో రకంగా ఉపయోగించుకునేలా ప్లాన్ చేయనున్నారట కేసీఆర్. ఒకవైపు రిజిస్ట్రేషన్లు ఆపేయడం , అలాగే రెవిన్యూ వ్యవస్థలో ప్రక్షాళన తేవడంతో తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వోలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇక వీళ్లకు ప్రతిపక్షాలు కూడా తోడవుతున్నాయి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి