కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేసిన ఫైర్ బ్రాండ్

0
50
TMN logo
TMN logo


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేసారు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి. తండ్రీ కొడుకులు చెబుతున్న దానికి , వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందని, వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోతే అరగంటకు పైగా అతడి శవం స్టెచర్ పైనే ఉంది అలాగే వర్షంలో అలాగే తడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని వాస్తవాలు ఇలా ఉండగా అయ్యా కొడుకులు మాత్రం గొప్పలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు లతో కరోనా విజృంభిస్తోంది. ఇక కరోనాతో చనిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటున్నారు. ఇక చనిపోయిన వాళ్ళని ముట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దానికి తోడు ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, ఆక్సిజన్ అందడం లేదని సెల్ఫీ వీడియోలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో భయపడాల్సిన పనిలేదని , చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అంటోంది. దాంతో మీరు చెబుతున్న దానికి , వాస్తవంలో జరుగుతున్న దానికి పొంతన లేదని కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి