కేసీఆర్ ‘నయా భారత్ ‘ పేరిట జాతీయ పార్టీ

0
41
kcr national party

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ”నయా భారత్” పేరిట కొత్త జాతీయ పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పేరు ఖరారు చేసిన కేసీఆర్ త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసి కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి అధ్యక్షుడిగా , తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ కు జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ? ఎలా వచ్చిందంటే ……… రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రాభవం రోజు రోజుకి పెరగడం అలాగే రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేయడమైతే …….. రెండోది తన వారసుడు కేటీఆర్ ని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయడం.

అసలు ఆమధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 16 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ సారు కారు సర్కారు అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపారు కేసీఆర్. 16 పార్లమెంట్ స్థానాలు గెల్చుకుంటే ఇతరులతో కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన చేయొచ్చనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పార్టీని కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితం చేసి 3 కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం ఎం ఐ ఎం పార్టీకి ఇచ్చారు. దాంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆలోచన కొంతకాలం పక్కకు పోయింది.

కట్ చేస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుండటంతో కేసీఆర్ అప్రమత్తం అవుతున్నారు. కేసీఆర్ కు అనుకూలంగా దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అందరికి కామన్ శత్రువు , బద్ద విరోధి నరేంద్ర మోడీ దాంతో జాతీయ స్థాయిలో కూటమికి ఆస్కారం ఏర్పడుతోంది. అలాగే జమిలి ఎన్నికలకు సిద్ధం అయితే ప్రాంతీయ పార్టీల హవా పార్లమెంట్ లో కష్టం అందుకే కేసీఆర్ నయా భారత్ పేరిట కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే దీనికి కార్యరూపం ఇచ్చాక వచ్చే ఏడాది 2021  జూన్ 2 నాటికి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లనున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి