కేసీఆర్ మనవడికి గాయాలు

0
42
kcr grandson

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు , తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తనయుడు హిమాన్షు కు గాయాలు అయ్యాయి దాంతో వెంటనే సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ మనవడుకి గాయాలు కావడంతో ఒక్కసారిగా ప్రగతి భవన్ లో కలకలం చెలరేగింది. టీనేజ్ లోకి అడుగుపెట్టిన హిమాన్షు అంటే అమితమైన ప్రేమ కేసీఆర్ కు అలాగే తండ్రి కేటీఆర్ కు కూడా. తనకంటే ఎత్తు ఎదిగిన కొడుకుని చూసుకుంటూ మురిసిపోతుంటాడు కేటీఆర్.

అయితే నిన్న రాత్రి ప్రగతి భవన్ లో నడుస్తున్న సమయంలో హిమాన్షు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట . కాలు అదుపుతప్పడంతో కాలు విరిగినట్లు తెలుస్తోంది. కింద పడిన తర్వాత పైకి లేవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వెంటనే సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి కాలు విరిగినట్లు తేల్చారు డాక్టర్లు. ప్రస్తుతం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు హిమాన్షు.

తన మనవడికి గాయాలు కావడంతో కేసీఆర్ తీవ్ర కలత చెందాడట. అలాగే కేటీఆర్ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యాడట. అసలే ఎం ఎల్ సి ఎన్నికలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా వరంగల్ , ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల కోసం దుబ్బాక ఉప ఎన్నిక కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు కేటీఆర్. ఆ హడావుడిలో ఉన్న సమయంలో తన కొడుకు కాలు విరగడంతో రాజకీయాలను పక్కన పెట్టి తనయుడి కోసం ఆలోచన చేస్తున్నాడట. ఆసుపత్రిలోనే ఉండి కొడుకుకి ధైర్యం చెప్పాడట కేటీఆర్. 

మునుపటి వ్యాసంనితిన్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా
తదుపరి ఆర్టికల్రాహుల్ గాంధీపై పోలీసుల దాడి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి