కవిత గెలుపుకు మార్గం సుగమం

0
41
kavitha mlc elections

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్కేసీఆర్ కూతురు , కేటీఆర్ చెల్లెలు నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గెలుపుకు మార్గం సుగమం అయ్యింది. ఈ ఏడాది మార్చిలో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధిగా కవిత పోటీ చేసింది. ఇక ఎన్నికలు లాంఛనమే అని అనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించడంతో ఈ ఎన్నిక వాయిదాపడింది. ఇక అప్పటి నుండి 7 నెలలుగా వాయిదా పడుతూనే ఉంది. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు కానీ వచ్చే నెలలో బీహార్ ఎన్నికలు నిర్వహిస్తున్నందువల్ల ఆ ఎన్నికలతో పాటుగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు కేంద్ర ఎన్నికల సంఘం.

నిజామాబాద్ జిల్లాలో దాదాపు 75 శాతం  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికార టిఆర్ఎస్ పార్టీ వాళ్లే కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తె గెలుపు సునాయాసం అవుతుంది కాబట్టి ఇక కవిత గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. అక్టోబర్ 9 న ఈ ఎన్నిక జరుగనుంది. మొత్తం 824 ఓట్లు ఉండగా అందులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఓట్లు 570 ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి 152 మంది మాత్రమే ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ లెక్కన కవిత గెలుపు అవలీలగా జరిగిపోతుంది ఎన్నిక అనేది కేవలం లాంఛన ప్రాయమే.

కవిత అసలు పార్లమెంట్ కు పోటీ చేసింది. గతంలో నిజామాబాద్ నుండి పోటీ చేసి విజయం సాధించింది కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యింది. దాంతో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. స్వయంగా కేసీఆర్ కూతురు కేటీఆర్ సోదరి ఓడిపోవడం సంచలనంగా మారింది. దాంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యింది రాజకీయంగా. ఇక ఈలోగా నిజామాబాద్ ఎం ఎల్ సి స్థానం ఖాళీ అవ్వడంతో కవిత ఎం ఎల్ సి గా శాసన మండలిలో అడుగు పెట్టడం ఖాయమైపోయింది. 

మునుపటి వ్యాసంరాజమౌళిని రిక్వెస్ట్ చేసిన చిరంజీవి
తదుపరి ఆర్టికల్బాలు ప్రాణం తీసిన సంగీత కచేరి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి