కారోనాకు భయపడి ఇంటిని సీల్ చేయించిన స్టార్ హీరో

0
76
TMN logo
TMN logo


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కారోనా మహమ్మారికి భయపడి తన ఇంటిని సీల్ చేయించాడు. ముంబై లోని మన్నత్ లో షారుఖ్ నివాసం ఉంది . ముంబై లో కారోనా విలయతాండవం చేస్తుండటంతో భయకంపితులు అవుతున్నారు ముంబై వాసులు. పైగా కారోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో భయపడిన షారుఖ్ ఖాన్ తన ఇంటికి ప్లాస్టిక్ కవర్ లతో కప్పించాడు. ప్లాస్టిక్ కవర్లు పెద్ద పెద్దవి పెట్టించాడు దాంతో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే షారుఖ్ ఖాన్ ఇలా చేయడానికి కారణం ఒక్క కారోనా మాత్రమే కాదు సుమా …… వర్షాకాలం  కూడా మరో కారణం. వర్షాకాలంలో భారీ వర్షాలతో పాటుగా పెద్ద పెద్ద తుఫాన్ లు కూడా వస్తాయి కాబట్టి ఆ తుఫాన్ ల వల్ల ఇబ్బందులు ఎదురు అవుతాయి కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్లతో కప్పించాడట. షారుఖ్ ఖాన్ గత రెండేళ్లుగా సినిమాల్లో నటించడం లేదు. గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి దాంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడేమో కారోనా గ్యాప్ ఇచ్చింది. కారోనా తగ్గిన తర్వాత కానీ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడేమో ఈ స్టార్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి