కరోనా తగ్గేవరకు షూటింగ్ లు వద్దంటున్న భామ

0
38

కరోనా తగ్గేవరకు షూటింగ్ లు వద్దంటోంది అందాల భామ బిపాసా బసు. కరోనా తగ్గకుండానే కొంతమంది షూటింగ్ లకు హాజరు అవుతున్నారు. ఇలా షూటింగ్ లకు వెళ్లడం వల్ల కరోనా బారిన పడుతున్నారని , అందువల్ల కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ లు పెట్టుకుంటే మంచిదని హితువు పలుకుతోంది బిపాసా బసు. ఇటీవల కాలంలో పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. బిగ్ బి కుటుంబం మొత్తం అలాగే అనుపమ్ ఖేర్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. అందుకే జాగ్రతలు తీసుకోవాలని అంటోంది బిప్స్.

షూటింగ్ లో మిగతవాళ్ళు పీపీఈ కిట్లు వాడుకోవచ్చు కానీ నటీనటులు అలా కాదు పాత్ర స్వభావం మేరకు సరైన కాస్ట్యూమ్స్ కూడా ఉండవు ఎందుకే కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు నటించడం మానేయండి అని సలహా ఇస్తోంది బిపాసా బసు. కరోనా యావత్ ప్రపంచానికి గుణపాఠం నేర్పింది. కరోనా విలయతాండవం చేస్తుండటంతో డబ్బున్న వాళ్ళు బాగానే ఉన్నారు కానీ రోజూ కష్టపడి పనిచేసుకునే వాళ్లకు మాత్రం చాలా ఇబ్బంది కరమైన పరిస్థితులు వచ్చాయి.

మునుపటి వ్యాసంవివాదాస్పద పాత్రలో నిత్యామీనన్
తదుపరి ఆర్టికల్కొడుకు కోసం విలన్ గా మారుతున్న స్టార్ హీరో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి