కరోనా బారిన పడిన స్టార్ హీరో

0
53

స్టార్ హీరో విశాల్ కరోనా బారిన పడ్డాడు. విశాల్ తో పాటుగా విశాల్ తండ్రి జీకే రెడ్డి కూడా కరోనాతో బాధపడుతున్నాడు. మొదట విశాల్ తండ్రి జీకే రెడ్డి కి కరోనా సోకగా తండ్రికి సేవలు అందించే క్రమంలో విశాల్ కు కూడా కరోనా సోకింది. దాంతో ఇద్దరు కూడా చికిత్స పొందుతున్నారు. హోమియో మందులు వాడుతూ త్వరగా కోలుకుంటున్నారట ఇద్దరు కూడా. విశాల్ కు అతడి తండ్రికి కరోనా సోకిందన్న విషయం బయటకు పొక్కడంతో ఎట్టకేలకు స్పందించాడు విశాల్. నేను నాన్న ఇద్దరం కూడా బాగానే ఉన్నాం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు విశాల్.

కరోనా నుండి దాదాపుగా కోలుకున్నట్లేనని , ప్రస్తుతం హోమియో మందులను వాడుతున్నామని తెలిపాడు విశాల్. జీకే రెడ్డి ప్రముఖ నిర్మాత అన్న విషయం తెలిసిందే. తెలుగులో పలు చిత్రాలను నిర్మించాడు. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యాక సినిమా నిర్మాణం ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద కొడుకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా చిన్న కొడుకు అయిన విశాల్ హీరోగా స్టార్ డం అందుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అన్నట్లు విశాల్ అచ్చ తెలుగు అబ్బాయి. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా విశాల్ కుటుంబానిది. అయితే జీకే రెడ్డి సినిమా నిర్మాణాల కోసం చెన్నై వెళ్లి స్థిరపడ్డారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి