బయటపడిన హీరోయిన్ రహస్య వివాహం

0
74
sanjana got marriage

టాలీవుడ్ మూవీ న్యూస్,బెంగళూరు –కన్నడ హీరోయిన్ సంజన రహస్య వివాహం ఇన్నాళ్లకు బయటపడింది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంజనని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఆ విచారణలో భాగంగానే సంజన చేసుకున్న రహస్య వివాహం బయటపడింది. గత ఏడాది కర్ణాటకలో ప్రముఖ వైద్యుడు అయిన అజీజ్ పాషాని రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం బయటపడింది. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసి సంజనని నిలదీయగా మొదట తనకు పెళ్లి కాలేదని బుకాయించిందట.

అయితే పోలీసులు సంజన పెళ్ళికి సంబందించిన ఫోటోలను సేకరించి బయట పెట్టడంతో ఎట్టకేలకు తనకు డాక్టర్ తో పెళ్లి అయినట్లుగా ఒప్పుకుందట. దాంతో షాక్ అవ్వడం పోలీసుల వంతు అయ్యింది. షూటింగ్ లో భాగంగా హీరోయిన్ లు రకరకాల పెళ్లిళ్లు చేసుకుంటుంటారు అలాంటిదే ఈ పెళ్లా ? లేక నిజమైన పెళ్లా ? అనే కోణంలో ప్రశ్నించగా నిజమైన పెళ్లి అని తన రహస్యాన్ని బయట పెట్టేసిందట పాపం.

ఇక డ్రగ్స్ విషయంలో కూడా తనకు ఏ పాపం తెలియదని బుకాయించిందట మొదట్లో. అయితే ఈ భామ డ్రగ్స్ సరఫరా చేసే బ్రోకర్ లతో కలిసి దిగిన ఫోటోలు , వీడియోలు పోలీసులకు చిక్కాయి అలాగే సంజన సన్నిహితులను అరెస్ట్ చేసి విచారించగా సంజన పేరుతొ పాటుగా రాగిణి ద్వివేది పేరు కూడా బయట పెట్టారట. అలా డ్రగ్స్ కేసులో పీకల్లోతు ఇరుక్కుంది సంజన. ఈ భామ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే అంతగా విజయాలు సాధించలేకపోయింది దాంతో కన్నడంలోనే సినిమాలు చేస్తోంది గతకొంత కాలంగా. 

మునుపటి వ్యాసంప్రభాస్ ఆది పురుష్ జనవరి నుండి
తదుపరి ఆర్టికల్నిజాలు తెలుసుకొని మాట్లాడు పవన్ కళ్యాణ్ : సంచయిత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి