బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా

0
95
Bollywood Kananga

రణవీర్ సింగ్ , రణబీర్ కపూర్ , విక్కీ కౌశల్ , అయాన్ ముఖర్జీ తదితరులు కొకైన్ బానిసలు అని బాలీవుడ్ లో పేరుంది. ఒకవేళ వాళ్ళు కొకైన్ బానిసలు కాదని నిరూపించుకోవాలంటే పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్. ఇంతకుముందు బాలీవుడ్ లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని సంచలన ఆరోపణలు చేసింది కంగనా రనౌత్. ఇక తాజాగా బాలీవుడ్ హీరోలైన రణవీర్ సింగ్ , రణబీర్ కపూర్ , అయాన్ ముఖర్జీ , విక్కీ కౌశల్ లను టార్గెట్ చేసింది. మీరు కొకైన్ తీసుకుంటారని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి కాబట్టి మీరు టెస్ట్ చేయించుకొని మీ నిజాయితీ నిరూపించుకోండి అని సవాల్ విసిరింది కంగనా.

అంతకుముందు కరణ్ జోహార్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రణవీర్ సింగ్ , దీపికా పదుకునే, రన్బీర్ కపూర్ , మలైకా అరోరా , అర్జున్ కపూర్, తదితరులు మాంచి జోష్ లో పార్టీ చేసుకున్న విజువల్స్ షాక్ అయ్యేలా చేస్తోంది. కంగనా రనౌత్ డ్రగ్స్ ఆరోపణలు చేయడంతో ప్రముఖ కాలమిస్ట్ అశ్విన్ మహాజన్ స్పందిస్తూ నేషనల్ అవార్డ్ అందుకోవడానికి వచ్చే వాళ్ళకు డ్రగ్స్ టెస్ట్ చేయాలని అప్పుడే వాళ్లు డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? అన్న విషయం తెలుస్తుందని అంటున్నాడు.

బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నెపోటిజం వల్లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించాడని విమర్శలు కూడా వస్తున్నాయి. సుశాంత్ కు మద్దతుగా నిలిచిన కంగనా రనౌత్ పలువురు ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. ఇక కంగనా ఆరోపణలకు స్పందించాడు బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే ఆ వీడియో ని నేనెందుకు సోషల్ మీడియాలో పెడతాను అదంతా వట్టి పుకారు మాత్రమే అని ఖండిస్తున్నాడు కరణ్ జోహార్. ఈ పార్టీ కరణ్ ఇంట్లో జరిగింది కావడంతో కంగనా ఆరోపణలని ఖండిస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి