కంగనా ఇల్లు కూల్చివేతపై సీరియస్ అయిన గవర్నర్

0
34
kangana 's house demolished in Mumbai

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబయి – బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు చెందిన బంగ్లాని నిన్న బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ముఖ్య సలహాదారుకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడమే కాకుండా తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని కూడా స్పష్టం చేసాడట దాంతో అధికార పార్టీ అయిన శివసేనలో కలకలం మొదలయింది.

అసలు గతకొంత కాలంగా శివసేన – భారతీయ జనతా పార్టీ ల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కంగనా వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఉద్దవ్ సర్కారు సరిగ్గా వ్యవహరించలేదని అటు బీజేపీ ఇటు కంగనా రనౌత్ ఆరోపణలు గుప్పిస్తోంది. దాంతో కంగనా రనౌత్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉంది ఉద్దవ్ సర్కార్.

ఈ దశలో ఫారిన్ లో ఉన్న కంగనా ని ముంబై లో అడుగు పెట్టనిచ్చేది లేదు అంటూ శివసేన ఎంపీ హెచ్చరికలు జారీ చేయడంతో వస్తున్నా కాచుకో అంటూ ప్రతి సవాల్ విసిరింది కంగనా. ఇక సందెట్లో సడేమియా లాగా కంగనా రనౌత్ కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. కంగనా ముంబై లో అడుగుపెట్టడం అదే సమయానికి కాస్త ముందుగా ముంబై లోని కంగనా రనౌత్ ఆఫీసుని అధికారులు కూల్చడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ముంబై నగరం వేడెక్కింది. ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన అక్రమ కట్టడం అంటూ ఈ సమయంలో కూల్చడం ఏంటి ? అంటూ గవర్నర్ ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. వ్యవహారం చూస్తుంటే ముంబై రాజకీయాలు ఏవో మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి