ఆసుపత్రికి వెళ్లి బాలుని పరామర్శించిన  కమల్ హాసన్

0
35
kamalhasan

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నై గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించినట్లు డాక్టర్లు ప్రకటించడంతో హుటాహుటిన చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు హీరో కమల్ హాసన్. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్న బాలు ని చూసి బాలు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలు త్వరగా కోలుకోవాలని , మళ్ళీ మన మధ్యలోకి రావాలని ఆకాంక్షించారు. బాలుకి కమల్ కు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. కమల్ హాసన్ నటించిన పలు చిత్రాలకు పాటలు పాడాడు అంతేకాదు కొన్ని చిత్రాల్లో గాత్రదానం కూడా చేసాడు బాలు. కమల్ హాసన్ – బాలు మంచి స్నేహితులు కావడంతో కమల్ ని హీరోగా పెట్టి సినిమాలు కూడా నిర్మించాడు బాలు.

గిన్నిస్ బుక్ రికార్డ్ బాలు సొంతం :

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 13 వేల నుండి 14 వేల పాటలు పాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం శిష్యగణం బాలు పాడిన పాటలను లెక్కవేసే పనిలో ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుండి సినిమాల్లో అలాగే టీవీ సీరియల్ లలో , వివిధ సంస్థల కోసం పాడిన పాటలు అన్నీ కలిపి 14 వేల వరకు ఉంటాయట. వాటిని అన్నింటినీ సేకరిస్తున్నారు. ఇవన్నీ సేకరించిన తర్వాత అచ్చు వేసి గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం పంపనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలో కూడా ఇన్ని వేల పాటలను పాడిన గాయకులు లేరు. కానీ ఆ అరుదైన ఘనత సాధించింది కేవలం ఒక్క బాలు మాత్రమే! ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా చరిత్ర సృష్టించాడు బాలు. తెలుగు , తమిళ్ , మలయాళం , హిందీ , కన్నడం లలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా పలు పాటలను ఆలపించారు బాలు. ఏ హీరోకు పాడాల్సి వస్తే ఆ హీరో గొంతుని అనుకరించి పాడటం బాలు నైజం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి