కరోనా సోకలేదంటున్న కమల్ హాసన్

0
12
Kamal Haasan don't sick of coronavirus

నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను కానీ నాకు ఎలాంటి కరోనా సోకలేదని కుండబద్దలు కొట్టాడు హీరో కమల్ హాసన్. ఇటీవలే విదేశాలకు వెళ్ళొచ్చాడు హీరో కమల్ హాసన్. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తనకు తానూ స్వీయ నిర్బంధం విధించుకున్నాడు కమల్. అయితే హీరో ఫారిన్ వెళ్ళొచ్చాడని గ్రహించిన కార్పొరేషన్ అధికారులు క్వారంటైన్ స్టిక్కర్ వేశారు కమల్ ఇంటికి.

అయితే అది పాత ఇల్లు అందులో కమల్ హాసన్ ఉండటం లేదు. ఇదే విషయాన్నీ కమల్ స్పష్టం చేసాడు. అలాగే నాకు కరోనా సోకిందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి దాంతో ఇలా ప్రకటన చేయాల్సి వస్తోందని తెలిపాడు కమల్ హాసన్. నాకు కరోనా సోకలేదు బాగానే ఉన్నాను కాకపోతే ఫారిన్ వెళ్ళొచ్చాను కాబట్టి గృహ నిర్భందంలో ఉన్నాను అంటూ తేల్చి చెప్పాడు కమల్ హాసన్. కమల్ తో పాటుగా ఇద్దరు కూతుర్లు శృతి హాసన్ , అక్షర హాసన్ లు కూడా ఫారిన్ వెళ్లొచ్చారు దాంతో వాళ్ళు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు వాళ్ళు కూడా.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి