యువతిని మోసం చేసిన లారెన్స్ తమ్ముడు

0
32
junior artist allegations on raghava lawrence brother elvin lawrence

హీరో రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేసింది వరంగల్ కు చెందిన యువతి. తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న నాకు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ పరిచయం అయ్యాడు. అయితే పరిచయం అవ్వడమే నన్ను పక్కలోకి రావాలని ,స్వర్గం అందించాలని అసభ్యంగా ప్రవర్తించాడు దాంతో నేను ఎదురు తిరిగాను. నేను లొంగకపోవడంతో మారేడ్ పల్లి కి చెందిన ఇన్ స్పెక్టర్ తో కలిసి కుట్రకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేస్తోంది.

నాపై వ్యభిచార ముద్ర వేసి జైలుకి కూడా పంపించారని , పోలీస్ అధికారితో పాటుగా ఎల్విన్ నన్ను వేధిస్తున్నారని , కాల్చుకు తింటున్నారని ఓ ఛానల్ ని ఆశ్రయించింది సదరు యువతి. అయితే లైన్ లోకి వచ్చిన పోలీస్ అధికారి ఆమె చెబుతున్న విషయం అంతా అబద్దం నాకు ఎలాంటి సంబంధం లేదు కాకపోతే లారెన్స్ సోదరుడు ఎల్విన్ కు ఈ యువతికి మాత్రం గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు. అంటే లోపల ఎదో జరుగుతోందనే కదా !

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి