చరణ్ కు సర్ప్రయిజ్ ఇవ్వబోతున్న ఎన్టీఆర్

0
18
Jr ntr surprise to ram charan

ఈరోజు హీరో రాంచరణ్ పుట్టినరోజు దాంతో అతడికి ఈరోజు సర్ప్రయిజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు హీరో ఎన్టీఆర్. తాజాగా ఇద్దరూ కలిసి ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. చరణ్ పుట్టినరోజు కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా కలవలేకపోతున్నామని ఇంట్లో ఉండాలని చెబుతూనే నీకు 10 గంటలకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో షాక్ ఇవ్వనున్నామని తెలిపాడు ఎన్టీఆర్.

దానికి యమా ఎగ్జైట్ అయ్యాడు చరణ్ వెయిట్ చేయలేను అంటూ రీ ట్వీట్ చేసాడు చరణ్. ఈరోజు చరణ్ పుట్టినరోజు కాబట్టి ఆర్ ఆర్ ఆర్ నుండి ఏదో ప్రత్యేకత చూపించబోతున్నట్లు తెలుస్తోంది . దాన్ని ఎన్టీఆర్ రివీల్ చేస్తాడేమో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జనవరి 8 విడుదల చేయనున్నారు దర్శకులు జక్కన్న. కరోనా నేపథ్యంలో చరణ్ పుట్టినరోజుని ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు పాపం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి