కరోనా గురించి జాగ్రత్తలు చెబుతున్న ఎన్టీఆర్ చరణ్

0
24
Jr ntr and ram charan raise awareness about coronavirus

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా మరింతగా వ్యాప్తి చెందుతుండటంతో దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారు స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రాంచరణ్ లు. కరోనా వ్యాధి భయంతో ప్రపంచ వ్యాప్తంగా పానిక్ సిచువేషన్ క్రియేట్ కావడంతో పానిక్ కి గురి కాకుండా దాని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా ఇద్దరు హీరోలు వివరిస్తూ వీడియో రూపొందించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిన్న హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరిగే ముందు వీడియో చిత్రీకరించారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. దాన్ని ఎడిట్ చేసి సాయంత్రానికి వదిలారు. ఇద్దరు కూడా స్టార్ హీరోలు కావడంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కావడంతో వెంటనే వైరల్ అయ్యింది. కరోనా పట్ల భయపడకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు ఎన్టీఆర్ , చరణ్ లు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి