ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్

0
47
ntr jr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించాల్సిన సినిమా చివరి నిమిషంలో రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే కథతో మరో హీరోతో సినిమా చేయడం అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడమే మంచిదయ్యింది లేకపోతే హిట్ అవ్వడం కష్టమే అయ్యేది అనే వార్త కూడా వినబడుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా ……. బొమ్మరిల్లు. అవును భాస్కర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు మొదట ఎన్టీఆర్ వద్దకే వెళ్ళింది. భాస్కర్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు కూడా నచ్చిందట.

అయితే బొమ్మరిల్లు సినిమా చేయడానికి కాస్త ఆలోచించాడు, ఎందుకంటే సాఫ్ట్ క్యారెక్టర్ ఎన్టీఆర్ కేమో మాస్ ఇమేజ్ ఉంది దాంతో ఇలాంటి సినిమా చేయకపోవడమే మంచిది అని డిసైడ్ అయి అప్పుడు బొమ్మరిల్లు నేను చేయను కాకపోతే సిద్దార్థ్ కి అయితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చాడట. దాంతో దిల్ రాజు , దర్శకుడు భాస్కర్ కు అదే నిజమని అనిపించిందట దాంతో సిద్దార్థ్ ని కలవడం కథ చెప్పడం సినిమా రూపొందడం బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.

ఒకవేళ ఎన్టీఆర్ కనుక బొమ్మరిల్లు సినిమా చేసుంటే తప్పకుండా ప్లాప్ అయ్యేదే ! ఎందుకంటే బొమ్మరిల్లు  చిత్రంలో ఎక్కడ కూడా హీరోయిజం ఉండదు ఎన్టీఆర్ ఏమో మాస్ హీరో కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు నీరసించే వాళ్ళు. ఎన్టీఆర్ బొమ్మరిల్లు రిజెక్ట్ చేసి మంచి పని చేసినట్లే అని చెప్పాలి. 2006 లో విడుదలైన బొమ్మరిల్లు సంచలన విజయం సాధించింది. చక్కని కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది బొమ్మరిల్లు.

 

మునుపటి వ్యాసంరూమర్లని ఖండించిన ఆంటీ
తదుపరి ఆర్టికల్మహేష్ టీంలో కరోనా కలకలం
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి