జెర్సీ రీమేక్ ని రిజెక్ట్ చేసిన రష్మిక మందన్న

0
19
jersey remake rejected rashmika mandanna

జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు కాగా ఆ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ రష్మిక మందన్న కు వస్తే మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. పైగా ఆ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసానో అని వివరణ కూడా ఇస్తోంది ఈ భామ. ఇంతకీ జెర్సీ రీమేక్ ని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా …….. కమర్షియల్ చిత్రం కాదని . అవును జెర్సీ కమర్షియల్ చిత్రం కాదు రియలిస్టిక్ మూవీ కాబట్టి నేను రిజెక్ట్ చేశాను అని కుండబద్దలు కొట్టేసింది రష్మిక మందన్న.

నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రంలో కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. శ్రద్దా శ్రీనాథ్ కు మంచి పెర్ఫార్మెర్ గా పేరొచ్చింది కానీ గ్లామర్ కు స్కోప్ లేకపోవడంతో రష్మిక మందన్న ఆ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించలేదు. ఈ భామకు కేవలం గ్లామర్ పాత్రలున్న కమర్షియల్ సినిమాలే కావాలట ! ఆ సినిమాలైతేనే పేరొస్తుందని క్రేజ్ వస్తుందని భావిస్తుంది రష్మిక మందన్న.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి