నాని వి చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసిన జక్కన్న

0
47
rajamouli family watching nani

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్నాని , సుధీర్ బాబు , నివేదా థామస్ , అదితి రావు హైదరీ తదితరులు నటించిన వి చిత్రాన్ని నిన్న దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబ సమేతంగా తన ఇంట్లోనే చూసాడు. జక్కన్న కుటుంబం ఉమ్మడి కుటుంబం అన్న విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి కుటుంబం అలాగే రాజమౌళి కుటుంబం ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓ పాతికపైనే ఉంటారు. వాళ్లంతా కలిసి జక్కన్న ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ లో వి చిత్రాన్ని చూసారు. కుటుంబ సమేతంగా వి చిత్రాన్ని చూశామని , మాములుగా అయితే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఉదయం 8 గంటల 45 నిమిషాల ఆట చూసేవాళ్లమని , అది మిస్ అయినా ఇది కూడా కొత్తగా ఉందని వి చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ.

జక్కన్న కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా చూస్తున్న సమయంలో ఓ ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు కార్తికేయ. అయితే వి సినిమా పై భారీ అంచనాలు ఉండేవి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యినట్లుగా తెలుస్తోంది. వి చిత్రాన్ని ఎప్పుడు చూస్తామా ? అన్న ఆత్రుత ఉండేది అంతకుముందు వరకు. తీరా సినిమా చూసిన తర్వాత ఆ ఉత్సాహం లేదని అంటున్నారు పలువురు.

మొత్తానికి అంచనాల మధ్య వచ్చిన వి కి ఆశించిన స్థాయిలో అయితే పాజిటివ్ టాక్ రావడం లేదు కానీ సరికొత్త ఎక్స్ పీరియన్స్ మాత్రం అందించింది అమెజాన్ ప్రైమ్ ద్వారా. సినిమా యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు జక్కన్న అండ్ కో అయితే సినిమా చూసాక ఎలా ఉంది అన్న రివ్యూ మాత్రం ఇవ్వలేదు అంటే జక్కన్నకు నచ్చలేదా ? లేక కామెంట్ చేయడం ఇష్టం లేదా ? ఏమో ! 

మునుపటి వ్యాసంఆ హీరో అభిమానుల డిమాండ్ కి ఒప్పుకుంటాడా ?
తదుపరి ఆర్టికల్రియా అరెస్ట్ తప్పదా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి