సీఎం జగన్ ఇంట విషాదం

0
57
jagan uncle died

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట తీవ్ర విశాదం నెలకొంది. జగన్ మామ వైఎస్ భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో జగన్ భార్య వై ఎస్ భారతి తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. తండ్రి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది భారతి.

గంగిరెడ్డి మరణించడంతో హైదరాబాద్ నుండి కడప జిల్లా లోని వేముల మండలం గొల్లల గూడూరు గ్రామానికి తరలించారు గంగిరెడ్డి పార్దీవ దేహాన్ని. గంగిరెడ్డి స్వగ్రామం గొల్లల గూడూరు దాంతో అంత్యక్రియలు స్వగ్రామంలోనే నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం గంగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నాడు. ముఖ్యమంత్రి తో పాటుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.

జగన్ మామ అయిన గంగిరెడ్డి డాక్టర్ దాంతో పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించేవాడు. పేదల పాలిట దేవుడిగా పేరు తెచ్చుకున్న గంగిరెడ్డి 2001 – 2005 మధ్య కాలంలో పులివెందుల మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసారు. గంగిరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి