జగన్ కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

0
67

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టులు మొట్టికాయలు ఎంతగా వేస్తున్నా తన పంథా అయితే మార్చుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్లు హై కోర్టు తో పాటుగా సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బలు తగులగా తాజాగా మరోసారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది జగన్ కు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలెక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ విషయంలో మరోసారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ ప్రసాద్ ని ఎన్నికల కమిషనర్ గా కొనసాగించడం జగన్ కు ఇష్టం లేదు దాంతో ఇంత రాద్ధాంతం జరుగుతుంది.

ఏపీ హైకోర్టు చెప్పినప్పటికీ జగన్ ప్రభుత్వం ఖాతరు చేయకుండా హై కోర్టు ఉత్తర్వులు లని కొట్టేయ్యల్సిందిగా సుప్రీం ని ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ పరంగా ఎన్ని వాదనలు వినిపించినా సుప్రీం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఒక దశలో ఏపీలో అసలు ఏం జరుగుతోంది. పరిపాలన ఉందా ? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దాంతో జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ ని చీఫ్ ఎలెక్షన్ కమీషనర్ గా కొనసాగించడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీ హైకోర్టు కూడా ఇప్పటికే పలుమార్లు జగన్ సర్కారు వైఖరిని తప్పు పట్టిన విషయం తెలిసిందే. అయితే కోర్టులు తప్పు పట్టినా జగన్ మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నాడు. మరి నిమ్మగడ్డ విషయంలో ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి