జగన్ కు లేఖ రాసిన బాలయ్య అందులో ఏముందంటే

0
70

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి నటసింహం నందమూరి బాలకృష్ణ లేఖ రాశారు అది ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి , బాలకృష్ణ ఇద్దరు కూడా వేర్వేరు పార్టీలకు చెందినవాళ్ళు పైగా తెలుగుదేశం పార్టీ అంటే జగన్ కు ఒళ్ళు మంట. అలాంటిది జగన్ కు బాలయ్య లేఖ రాయడం అభినందనలు తెలియజేయడం అలాగే ఓ కోరిక కోరడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ బాలయ్య రాసిన లేఖలో ఏముందో తెలుసా………

హిందూపురం ని జిల్లా కేంద్రం చేయాలని కోరాడు బాలయ్య. అనంతరం జిల్లాలోని హిందూపురం నుండి రెండోసారి గెలిచాడు బాలయ్య. త్వరలోనే జిల్లాలను పెంచాలని నిర్ణయించారు జగన్. ఏపీలో ఇప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి దాంతో ఆ సంఖ్యని 25 కు పెంచాలని భావిస్తున్నారు జగన్. అంటే ఇప్పుడు ఉన్న జిల్లాలకు అదనంగా మరో 12 కొత్త జిల్లాలు ఏర్పడతాయన్న మాట. దాంతో ఎంతో ప్రాశస్త్యం ఉన్న హిందూపురం ని జిల్లా గా చేయాలని అలాగే జిల్లా కేంద్రంగా హిందూపురంనే కొనసాగించాలని లేఖలో కోరాడు బాలయ్య. అలాగే ఇటీవల హిందూపురం కు మెడికల్ కాలేజ్ ప్రకటించారు జగన్ దాంతో తన నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజ్ ని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. తన అభిమాన హీరో నుండి లేఖలు అందడంతో జగన్ సంతోషాన్ని వ్యక్తం చేశారట. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాలయ్య లేఖ సంచలనం సృష్టిస్తోంది.

మునుపటి వ్యాసంనెటిజన్లను ఆకర్షిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్
తదుపరి ఆర్టికల్వివాదాస్పద పాత్రలో నిత్యామీనన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి