జబర్దస్త్ నటులు అరెస్ట్

0
30
Jabardasth dorababu paradeshi arrested by police for running prostitution

వ్యభిచారం కేసులో జబర్దస్త్ నటులు అరెస్ట్ అయ్యారు. హైపర్ ఆది స్కిట్ లో నటించే దొరబాబు , పరదేశీ అనే ఇద్దరు నటులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. విశాఖపట్టణం సమీపంలో ఇంట్లో వ్యభిచారం సాగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో దాడులు చేసారు. ఒక్కసారిగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు చేయడంతో మహిళలతో పాటుగా దొరబాబు , పరదేశీ లు పట్టుబడ్డారు. ఇద్దరు కూడా బుల్లితెర పై ఫేమస్ అయిన ఆర్టిస్ట్ లు కావడంతో అవాక్కు అవ్వడం పోలీసుల వంతు అయ్యిందట.

దొరబాబు ఎక్కువగా ఫేమస్ అయ్యాడు , ఇక ఇటీవల కాలంలో పరదేశీ కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే వ్యభిచారం కేసులో వాళ్ళు అడ్డంగా బుక్కవ్వడంతో వాళ్ళని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు పోలీసులు. దొరబాబు యూట్యూబ్ లో సైతం అడల్ట్ కంటెంట్ ఉన్న చిన్న చిన్న వీడియోలు చేసాడు. ఇక హైపర్ ఆది స్కిట్ లో కూడా అలాంటి డైలాగ్స్ చెబుతుంటాడు దొరబాబు. ఇలా జబర్దస్త్ నటులు పోలీసులకు దొరకడంతో పలువురు షాక్ అవుతున్నారు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి