చిరంజీవికి ఘోర అవమానం అందుకే ఛాలెంజ్ చేశాడట

0
66
mega star chiranjeevi

చిరంజీవికి ఘోర అవమానం అందుకే ఛాలెంజ్ చేశాడట

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తొలినాళ్ళలో అప్పటి స్టార్ హీరోలకు సంబంధించిన వాళ్ళు చిరంజీవిని ఘోరంగా అవమానించారట. ముందు వరుసలో కూర్చున్న చిరంజీవిని లేపి వెనుకాల ఎక్కడో మూలన కూర్చోమని చెప్పారట దాన్ని అవమానింగా భావించిన చిరు అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకున్నారట కానీ సభ్యత కాదేమో అని సినిమా అయ్యేంత వరకు కూర్చున్నాడట. తర్వాత మాత్రం పెద్ద ఛాలెంజ్ చేశాడట. నేను సినిమారంగంలో హీరోని కావాలని వచ్చాను కానీ ఇప్పుడు చెబుతున్నా హీరోని కాదు పెద్ద హీరో అవుతాను …… అందర్నీ మించిన నెంబర్ వన్ హీరో అవుతాను ఇదే నా ఛాలెంజ్ అని ఆవేశంతో ఊగిపోయాడట .

అయితే ఈ విషయాన్ని ఇన్నాళ్లకు చెబుతున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. తనకంటూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నాడు నాగబాబు. ఆ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఆమధ్య పలు వివాదాస్పద వీడియోలను విడుదల చేశాడు నాగబాబు. ఇక ఇప్పుడేమో అన్నయ్య చిరంజీవి నెంబర్ హీరో కావడానికి  దారి తీసిన పరిస్థితులను వెల్లడిస్తున్నాడు. అప్పట్లో ఓ స్టార్ హీరో మనుషులు ఘోరంగా అవమానించడం వల్లే అన్నయ్యతో కసి పెరిగిందని , దాంతో కష్టపడి నెంబర్ వన్ హీరో అయ్యాడని అంటున్నాడు నాగబాబు.

అయితే నాగబాబు తన అన్నయ్యకు జరిగిన అవమానం గురించి చెప్పాడు కానీ అప్పటి స్టార్ హీరో ఎవరు ? అతడి మనుషులను మాత్రం వెల్లడించలేదు. అప్పట్లో స్టార్ హీరోలు ఎవరు ? అన్నది తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. ఆ విషయం పక్కన పెడితే అవమానాలు జరిగితే కుంగిపోవడం కాకుండా ఛాలెంజ్ గా తీసుకొని కష్టపడితే పైకి ఎదగొచ్చు అని పలువురు ప్రముఖులు నిరూపించారు.

మునుపటి వ్యాసంకరోనా ఆసుపత్రికి 55 లక్షలు ఇస్తున్న బాలయ్య
తదుపరి ఆర్టికల్ప్రభాస్ నిర్ణయం వల్ల డైలమాలో పడిన అల్లు అరవింద్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి