పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొడతారని తప్పుకున్నాడా?

0
18

పవర్ స్టార్ అనే వివాదాస్పద సినిమా తీస్తున్నట్లు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ అనే టైటిల్ ని ప్రకటించడమే కాకుండా అచ్చం పవన్ కళ్యాణ్ ని తలపించేలా ఉన్న ఓ వ్యక్తి తాలూకు వీడియో కూడా విడుదల చేసి మరింత సంచలనం సృష్టించాడు వర్మ. అంతేకాదు పవర్ స్టార్ సినిమాలో ముగ్గురు భార్యలతో పాటుగా మరికొంతమందితో రొమాన్స్ చేసినట్లుగా చూపించే ప్రయత్నంలో ఉన్నాడు వర్మ. ఇక షూటింగ్ కి వెల్లడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో పవర్ స్టార్ పాత్రలో నటించే నటుడు పవర్ స్టార్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆనటుడు ఎందుకు తప్పుకున్నాడో తెలుసా……

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు భయపడి అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పాత్రలో నటిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ? ఉరికించి ఉరికించి మరీ కొడతారు. దాంతో వాళ్ళ చేతిలో దెబ్బలు తినే కంటే సినిమా నుండి తప్పుకోవడమే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట.అందుకే పవర్ స్టార్ సినిమాలో నటించను అని చెప్పాడట. ఇక ఈ నటుడు తప్పుకోవడంతో మరో నటుడిని పట్టుకునే పనిలో పడ్డాడు రాంగోపాల్ వర్మ. సినిమా బాగుందా ? లేదా ? అన్నది వర్మకు అనవసరం కావాల్సింది డబ్బులు అంతే. ప్రాజెక్ట్ ప్రకటించడం సొమ్ము చేసుకోవడం ఇదే వర్మ తంతు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి