రెండో పెళ్లి వాడంటే హీరోయిన్ లకు మోజా ?

0
26
heroines

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్స్టార్ హీరోయిన్ లుగా వెలుగొందిన పలువురు అందమైన భామలు ఏ రాజకుమారుడి లాంటి వాళ్ళనో చేసుకోకుండా రెండో పెళ్లి వాడ్ని ,మూడో పెళ్లి వాడ్ని చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఈ తతంగం అటు హిందీ చిత్ర పరిశ్రమలో ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలాగే కన్నడ , మలయాలం అంటూ తేడా లేకుండా అన్ని భాషల్లో హీరోయిన్ లు చేస్తున్న పనే. ఇంతకుముందు జరిగింది కాదు ఇప్పుడు కూడా జరుగుతున్న పని. అందంతో , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పలువురు హీరోయిన్ లు పెళ్లి విషయం వచ్చేసరికి రెండో పెళ్లి చేసుకోవడం విచిత్రంగా మారింది.

రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ ల జాబితా చాలా పెద్దదిగానే ఉంది అయితే మచ్చుకు కొన్ని ఈరోజు చూద్దాం.
శ్రీదేవి :    అతిలోక సుందరిగా పేరుగాంచిన భామ శ్రీదేవి. అందంతో పాటుగా తనదైన అభినయంతో కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా హిందీతో సహా అన్ని భాషల్లో నటించింది శ్రీదేవి. ఆమెని పెళ్లి చేసుకోవాలని ఊహించుకొని వారు లేరంటే అతిశయోక్తి లేదు కానీ అంతటి స్టార్ డం ఉన్న హీరోయిన్ అయినప్పటికీ అప్పటికే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్న బోనీ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

విద్యాబాలన్ :    భారీ అందాల భామ విద్యాబాలన్ ఓవైపు నటనతో ఆకట్టుకుంటూనే మరోవైపు భారీ అందాల విందుతో ప్రేక్షకులను అలరించింది. అలాంటి ఈ భామ సిద్దార్థ్ రాయ్ కపూర్ ని మూడో వివాహం చేసుకోవడం విశేషం. సిద్దార్థ్ రాయ్ కపూర్ కు అప్పటికే రెండుసార్లు వివాహం అయి విడాకులు తీసుకోగా విద్యాబాలన్ మూడో భార్యగా అడుగుపెట్టింది.

కరీనా కపూర్ :         కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. సైఫ్ కు కరీనా కు వయసు రీత్యా చాలా గ్యాప్ ఉంది అంతేకాదు అప్పటికే సైఫ్ కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంతేనా ……. సైఫ్ కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ కరీనా మాత్రం సైఫ్ ని ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.

కరిష్మా కపూర్ :    కరీనా కపూర్ అక్క అయిన కరిష్మా కపూర్ కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అభిషేక్ బచ్చన్ తో కరిష్మా కపూర్ కు ఎంగేజ్ మెంట్ అయ్యింది కానీ పెళ్లి కాకుండా పోవడంతో అప్పటికే పెళ్లి అయిన సంజీవ్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత సంజీవ్ కపూర్ కు విడాకులు కూడా ఇచ్చింది కరిష్మా కపూర్.

వీళ్ళతో పాటుగా శిల్పా శెట్టి , మాన్యత , షబానా అజ్మీ , స్మితా పాటిల్ , సారిక , లారా దత్త , కిరణ్ రావు , కల్కి కొచ్లిన్ , అమృత అరోరా , రాధిక , అమల , విజయనిర్మల తదితరులు రెండో పెళ్లి వాళ్లనే చేసుకున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి