ఇంద్రప్రస్థం మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచాడు

0
83
indra prasthanam

ఇంద్రప్రస్థం మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచాడు దర్శకుడు దేవా కట్టా. చంద్రబాబు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల స్నేహం పై ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నాడు దేవా కట్టా. సరిగ్గా ఇదే కథాంశంతో మరో యువ దర్శకుడు కూడా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఆ యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవా కట్టా వెంటనే మోషన్ పోస్టర్ విడుదల చేసి అంచనాలు పెంచాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ కూడా దేవా నే చేయాలని అనుకున్నాడట. అయితే తన ఐడియాలను కాపీ కొట్టి సినిమా తీసాడు కానీ దాన్ని సరిగ్గా చేయలేకపోవడంతో ప్లాప్ అయ్యిందని కూడా కామెంట్ చేసాడు దేవా కట్టా. విష్ణు ఇందూరి పై తీవ్ర ఆరోపనలు చేసినప్పటికీ విష్ణు మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు.

ఇక చంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల విషయానికి వస్తే ……. 80 వ దశకంలో ఇద్దరు కూడా మంచి మిత్రులే. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి అడుగుపెట్టారు. ఇద్దరు కూడా రాయలసీమ నాయకులు కావడం విశేషం. చంద్రబాబు చిత్తూరు జిల్లా కాగా వై ఎస్ దీ కడప జిల్లా. ఇద్దరు కూడా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే తక్కువ సమయంలోనే చంద్రబాబు మంత్రిగా , ముఖ్యమంత్రి గా ఎదిగాడు. ఇక వై ఎస్ మాత్రం 2004 లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకప్పుడు ఇద్దరు మంచి స్నేహితులు అయితే ఆ తర్వాత రాజకీయంగా తీవ్ర విబేధాలతో శత్రువులు అయ్యారు. వై ఎస్ ఘోర ప్రమాదంలో మరణించగా చంద్రబాబు మాత్రం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు. దాంతో ఈ ఇద్దరితో కూడిన వెబ్ సిరీస్ అంటే ప్రేక్షకులకు నాయననందకరమే అని చెప్పాలి.

మునుపటి వ్యాసంకాస్టింగ్ కౌచ్ పై అనసూయ వ్యాఖ్యలు
తదుపరి ఆర్టికల్సన్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి